Monday, April 29, 2024

Oscar Member – రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం – ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో సభ్యత్వం

టాలీవుడ్ హీరో రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఇప్పుడు ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లోనూ సభ్యత్వం సాధించారు.అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఇటీవల యాక్టర్స్‌ బ్రాంచ్‌లోకి కొంతమంది కొత్త సభ్యులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొంతమంది ప్రతిభావంతులైన నటీనటులకు దీనిలో చోటు కల్పించింది.

‘ఎంతో అంకిత భావంతో ఈ నటులు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణంపోశారు. వారి కళతో సాధారణ సినిమాతో కూడా ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారు. భావోద్వేగాలను పంచుతూ ప్రశంసలు అందుకుంటున్నారు’ అని అకాడమీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. కొత్తగా ఎంపిక చేసిన వారి పేర్లను వెల్లడించింది.

. ఇక ఈ లిస్ట్‌లో రామ్ చరణ్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ఈ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో ఇటీవల ఎన్టీఆర్‌ కూడా స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే

Advertisement

తాజా వార్తలు

Advertisement