Wednesday, May 1, 2024

మ‌రోసారి పోలీసుగా.. యంగ్ హీరో

టాలీవుడ్ లో పోలీస్ పాత్ర‌ల‌కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది..అప్పుడ‌యినా..ఇప్పుడ‌యినా పోలీసు పాత్ర‌ల పంథానే వేరుగా ఉంటుంది. ఇప్ప‌టికే పోలీసు క‌థ‌ల‌తో వ‌చ్చిన చిత్రాల‌న్నీ సూప‌ర్ డూప‌ర్ హిట్ట్ కొట్టాయి. కాగా రాక్షసుడు సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా తన సత్తా చాటారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. తాను పోలీస్ ఆఫీసర్ గా చేసిన ఆ సినిమా హిట్ కావడంతో, మరోసారి అదే పాత్రలో కనిపించడానికి ఆయన రెడీ అవుతున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తన తాజా చిత్రాన్ని సాగర్ కె చంద్ర దర్శకత్వంలో చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ఈ సినిమాలో ఆయన టిపికల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తార‌ట. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఈ పాత్ర ఉంటుందని సమాచారం. ఈ సినిమాకి ‘టైసన్ నాయుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా టాక్. ఇంతవరకైతే ఈ సినిమా కోసం కథానాయికను తీసుకోలేదు. త్వరలోనే కథానాయిక ఎంపిక ప్రక్రియ కూడా పూర్తవుతుందట‌. రామ్ ఆచంట – గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకి, భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. మ‌రి ఈసారి బెల్లంకొండ శ్రీనివాస్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement