Saturday, May 18, 2024

Official | అయలాన్‌ తెలుగు వెర్షన్‌ రిలీజ్ డేట్ ఇదే..

కోలీవుడ్‌ హీరో శివకార్తికేయన్ నటిస్తోన్న ప్ర‌ధాన పాత్ర‌లో సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో ఆర్‌ రవికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ అయలాన్‌. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయలాన్ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించేశారు. తాజాగా అయలాన్ తెలుగు వెర్షన్ ను జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. ఈ లుక్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక ఈ సినిమాకి ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అయలాన్‌లో శరద్‌ కేల్కర్‌, ఇషా కొప్పికర్‌, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్‌, బాల శరవణన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివకార్తికేయన్ మరోవైపు రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేస్తున్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement