Monday, May 6, 2024

‘రాధే శ్యామ్’ కు అదిరిపోయే ఆఫర్స్ ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మళ్లీ రీ షూట్ కి రెడీ అయింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ క్రమంలోనే రాధేశ్యామ్ కు థియేట్రికల్ బిజినెస్ తో పాటు ఓటీటీ పరంగా కూడా మంచి డీటెయిల్స్ వస్తున్నాయట.

కానీ మేకర్స్ మాత్రం డిసైడ్ అవ్వలేకపోతున్నారట. ఇప్పటికే బాలీవుడ్ లో పలు చిత్రాలకు థియేట్రికల్ తో పాటు స్ట్రీమింగ్ లో కూడా విడుదల అవుతున్నాయి. అదేవిధంగా రాధే శ్యామ్ కు డీల్స్ వస్తున్నాయట. కానీ దర్శక నిర్మాతలు మాత్రం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట.

Advertisement

తాజా వార్తలు

Advertisement