Tuesday, April 30, 2024

బిగ్ ఫైట్ సీక్వెన్స్ తో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న‌ NTR30

కొరటాల శిక ద‌ర్శ‌క‌త్వంలో గ్లోబ‌ల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జ‌ర‌గుతోంది. నెల రోజుల్లో రెండు షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది మూవీ టీమ్. ఇటీవలే ముగిసిన రెండో షెడ్యూల్‌లో ఓ మేజర్ ఫైట్ సీక్వెన్స్‌ను ముగించారు. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. కాగా, ఈ భారీ యాక్షన్ డ్రామాను మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు.

మహిళా కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. వీరిద్దరు కూడా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. మే రెండో వారంలో తదుపరి దశ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement