Sunday, May 5, 2024

బావమరిది కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి సోదరుడు నార్నే నితిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు గత కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి మొదట తేజ దర్శకత్వంలో చట్రం రీమేక్ సినిమా తెరకెక్కుతోందని ఆ సినిమాలో నార్నే నితిన్ నటించబోతున్నారని టాక్ నడిచింది. కానీ దానిపై ఎక్కడా కూడా అధికారిక ప్రకటన రాలేదు. కాగా అది ఒట్టి పుకారు గానే మిగిలింది.

కాగా తాజా సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నితిన్ తొలి చిత్రం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. స్క్రిప్ట్ ఎంచుకోవడంలో నితిన్ కు సూచనలు చేస్తున్నాడట. ఇద్దరు కలిసి ఇప్పటికే ఓ స్క్రిప్టు కూడా ఓకే చేశారట. అయితే ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించబోతున్నారట. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను త్వరలోనే తెలుపనున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement