Tuesday, April 16, 2024

Nora Fatehi : శ్వేతబ‌రిగా మ‌నోహ‌రి..

బాహుబలి సినిమాలో మనోహరి పాటతో అలరించిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి. బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా మంచి ఫాలోయింగ్‌ దక్కించుకున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలతో అలరిస్తూ ఉంది. తాజాగా మరోసారి తన అందాల ఫోటోలను షేర్‌ చేసి ఆకట్టుకుంది. ఫెమినా ఇండియా మ్యాగజైన్ కోసం వైట్ డ్రెస్ లో టైట్‌ అందాలతో కవర్ పేజ్‌ పై ఫోజ్‌ ఇచ్చింది.

గతంలో స్కిన్‌ షో తో మెప్పించిన అందాల తార ఈసారి అంతకు మించి అన్నట్లుగా స్కిన్‌ షో చేయకున్నా కూడా అందంగా కనిపిస్తోందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి డాన్సర్‌ అయిన ఈ అమ్మడు గతంలో ఎన్నో సినిమాల్లో ప్రత్యేక పాటల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు హిందీ సినిమాలతో పాటు ఒక తెలుగు సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. వెబ్‌ సిరీస్ లకు కూడా మోస్ట్ వాంటెడ్‌ గా హీరోయిన్‌ గా నోరా ఫతేహీ నిలుస్తోంది. రెగ్యులర్‌ గా సోషల్ మీడియా ద్వారా అందాల ఫోటోలతో అలరించే ముద్దుగుమ్మ ఇలా ఫుట్ టైట్‌ వైట్ డ్రెస్ లో భలే ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ సినిమాలకే పరిమితం అయిన ఈ అమ్మడు చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌ సినిమాకు కమిట్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement