Monday, May 6, 2024

”ఎక్స్‌ట్రా- ఆర్డినరీ”గా నితిన్ కొత్త‌ సినిమా పోస్ట‌ర్..

హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న 32వ చిత్రానికి ”ఎక్స్‌ట్రా” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దర్శకుడు వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఆదివారం ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో నితిన్‌ రెండు విభిన్నమైన లుక్స్‌తో కనిపిస్తున్నారు. ఓ దానిలో ఆయన హెయిర్‌ స్టైల్‌, గడ్డంతో సీరియస్‌గా కనిపిస్తున్నారు. అదే పోస్టర్‌లో మరో లుక్‌లో గడ్డం లేకుండా చాలా కూల్‌గా కనిపిస్తున్నారు నితిన్‌.

- Advertisement -

”ఎక్స్‌ట్రా” అనే టైటిల్‌తో పాటు ”ఆర్డినరీ మేన్‌” అనే ట్యాగ్‌లైన్‌ పోస్టర్‌లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్‌ 23న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. హరీష్‌ జైరాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement