Tuesday, March 26, 2024

వేణుస్వామితో పూజ‌లు చేయించిన.. నిధి అగ‌ర్వాల్

జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు వేణు స్వామి..ఆయ‌న‌తో ఇంట్లో పూజలు చేయించింది హీరోయిన్ నిధి అగ‌ర్వాల్.. ఆయన ఇప్పటికే ఎంతో సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు సంబంధించిన ఎన్నో విషయాలను బయటపెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. చాలామంది స్టార్ హీరోయిన్లు కూడా ఆయనతో పూజలు చేయించుకుంటూ కెరియర్ లో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మిక మందన్న, కృతి శెట్టి వంటి వారు కూడా ప్రత్యేకంగా పూజలు చేయించడం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి నిధి అగర్వాల్ కూడా చేరిపోయింది. నిధి అగర్వాల్ ఇంట్లో రాజ శ్యామల పూజ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిధి అగర్వాల్తో వేణు స్వామి బృందం పూజ చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో నిధి అగర్వాల్ పింక్ కలర్ చుడీదార్ ధరించి వేణు స్వామి బృందం చెబుతున్నట్టుగా వేదమంత్రాల మధ్య కలశానికి పూజలు చేసింది.ఇక నిధి అగర్వాల్ పక్కనే కూర్చుని వేణు స్వామి ఈ పూజ చేయించారు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement