Monday, May 6, 2024

New Song – నానీ ‘హాయ్ నాన్న’ మూవీ నుంచి ‘గాజు బొమ్మ’ సాంగ్ రిలీజ్ … వీడియోతో..

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హాయ్ నాన్న’ వైరా ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘గాజు బొమ్మ’ సాంగ్ లిరికల్ వీడియో ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చాడు.

“ఇటు రావే నా గాజు బొమ్మా… నేనే నాన్నా అమ్మా… యద నీకు ఉయ్యాల కొమ్మా… నిన్ను ఊపే చెయ్యే ప్రేమా” అంటూ సాగే ఈ గీతం తండ్రి, కుమార్తె మధ్య అనుబంధాన్ని చాటేలా ఉంది. హృదయాలను హత్తుకునేలా ఉన్న ఈ గీతాన్ని సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వయంగా ఆలపించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement