Monday, April 29, 2024

ఆదిపురుష్ వాయిదాతో ప్ర‌భాస్‌కి కొత్త క‌ష్టాలు.. మిగ‌తా సినిమాల‌పై ఆ ఎఫెక్ట్ ఉండేనా?

‘ఆదిపురుష్’ కొత్త రిలీజ్‌ డేట్‌పై యూవీ క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చేసింది. ఓంరౌత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. సీతగా కృతి సనన్ కనిపించబోతోంది. ఇక రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అయితే.. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పునరాలోచనలో పడిన ‘ఆదిపురుష్’ టీమ్.. కాస్త లేట్‌గా థియేటర్లలో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలిపింది.

అయితే ఈ పోస్ట్ పోన్ ఎఫెక్ట్ ప్రభాస్ మరో సిినిమాపై పడనుందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో.. వాస్తవానికి 2023, జనవరి 12న రిలీజ్ కావాల్సిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జూన్ 16న రిలీజ్ చేయబోతున్నట్లు యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. సంక్రాంతి బరిలో ఉంటుందనుకున్న ఆదిపురుష్ ఇప్పుడు జూన్ 16న మాత్రమే విడుదలవుతుందని స్పష్టం చేయడంతో, ప్రాభాస్ ఇతర సినిమాలపై చర్చ మెదలైంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సాలార్ 28 సెప్టెంబర్ 2023న విడుదల కానుంది. హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మిస్తుండగా.. KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సాలార్ ఇప్పటి వరకు ప్రభాస్ కెరీర్ లో అతిపెద్ద మూవీ అని చెప్పోచ్చు. అయితే ఇప్పుడు ఆదిపురుష్ జూన్‌లో రేసులో చేరింది. కేవలం మూడు నెలల వ్యవధిలో ప్రభాస్ రెండు బ్యాక్ టు బ్యాక్ మోగా సినిమాల రిలీజ్ లను మేకర్స్ కోరుకోవడం లేదు అన్న గాసిప్సో షల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సాలార్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement