Sunday, April 28, 2024

అరియానాని వాట్సాప్ నెంబ‌ర్ అడిగిన నెటిజ‌న్..

లాక్‌డౌన్ వ‌ల‌న షూటింగ్స్ అన్ని స్తంభించిన విష‌యం తెలిసిందే. దీంతో వెండితెర‌,బుల్లితెర ఆర్టిస్టులంద‌రు ఇళ్ల‌కే ప‌రిమిత‌య్యారు. దీంతో సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో చిట్ చాట్ చేస్తూ కాల‌క్షేపం పొందుతున్నారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అరియానా నెటిజ‌న్స్ తో కాసేపు ముచ్చ‌టించ‌గా, ఓ నెటిజ‌న్ వాట్సాప్ నెంబ‌ర్ అడిగారు. నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు అరియానా ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. వాట్సప్ నంబర్ ఇవ్వాలని నాక్కూడా ఉంది..కానీ ఇవ్వలేను.. ఇంట్లో వాళ్లు నన్ను చంపేస్తారు.. అందుకే ఇవ్వడం లేదు..లేకపోతే కచ్చితంగా ఇచ్చేదాన్ని అంటూ చ‌లాకీగా స‌మాధానం చెప్పింది. బిగ్ బాస్ షో త‌ర్వాత అరియానాకు బుల్లితెర, వెండితెరపై వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి. బుల్లితెర మీద స్పెషల్ ఈవెంట్లు, కామెడీ స్టార్స్ అంటూ ఆ మధ్య రచ్చ చేస్తున్న అరియానా వెండితెర‌పై రాజ్ త‌రుణ్ చిత్రంలో న‌టించ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement