Wednesday, May 29, 2024

Jersey | రీరిలీజ్ కి రెడీ అయిన నాని జెర్సీ..

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ జెర్సీ. నాని కెరీర్ లోనే స్పెషల్ మూవీగా నిలిచిన ఈ సినిమా రీరిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమాలో నాని నటన మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ లవ్ డ్రామా మూవీ క్రికెట్ నేపథ్యంలో 2019లో విడుదలైంది. కాగా, మూవీ విడుదలై ఐదేళ్లు కావొస్తున్న నేపథ్యంలో ప్రత్యేక షోలు వేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

దీంతో ఈ నెల 20న ఎంపిక చేసిన థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ప్రశంసలు అందుకుంది. జెర్సీ సినిమాకి గాను 2021 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బెస్ట్ ఎడిటర్ పురస్కారం నవీన్ నూలి సొంతం చేసుకున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ మూవీని నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement