Saturday, April 27, 2024

70శాతం షూటింగ్ కంప్లీట్ చేసిన బింబిసార!!

కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ల అవుతున్నా… ఓ రెండు మూడు హిట్ లను మాత్రమే అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్మ్ ఇక గతేడాది ఎంత మంచి వాడవురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. అయితే ఇటీవల కళ్యాణ్ రామ్ తన లేటెస్ట్ చిత్రం గురించి అనౌన్స్ చేశాడు. ఆ చిత్రానికి బింబిసార అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు.

వశిష్ట్ దర్శకత్వంలో హిస్టారికల్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే కళ్యాణ్ రామ్ మునుపెన్నడూ కూడా ఇలాంటి స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు రాలేదు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ అనౌన్స్ చేసినప్పటికీ చాలా భాగాన్ని కంప్లీట్ చేశాడట కళ్యాణ్. ఇప్పుడు ఏకంగా 70 శాతం షూటింగ్ ను పూర్తి చేశాడట. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరి ఈ సినిమాతో అయినా కళ్యాణ్ రామ్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement