Saturday, May 18, 2024

నాగార్జున “నా సామి రంగ” రిలీజ్ డేట్‌ ​అప్పుడే !

కింగ్ నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామి రంగ’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ & సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే మేకర్స్ ఈ సినిమా షూటింగ్ పనులు త్వరగా పూర్తిచేసి జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.

గతంలో జనవరి 14న విడుదలైనటువంటి బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే మరో చిత్రం సోగ్గాడే చిన్నినాయన గతంలో జనవరి 15న సంక్రాంతికి విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. అలానే ఈ సెంటిమెంట్ ప్రకారం చూస్తే ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో అసిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా…. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement