Thursday, May 2, 2024

లవ్‌స్టోరీ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం లవ్ స్టోరీ. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సారంగదరియా సాంగ్ సోషల్ మీడియాలో నయా ట్రెండ్ సృష్టిస్తోంది.

అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 8న ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన మాత్రం చెయ్యలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement