Sunday, April 28, 2024

ప్రవీణ్ సత్తార్ సినిమా కోసం నాగ్ ప్రత్యేక శిక్షణ ?

సోలమన్ దర్శకత్వంలో కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వైల్డ్ డాగ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇక కరోనా కారణంగా కూడా కలెక్షన్లు మరింత తగ్గిపోయాయి. ఇదిలా ఉండగా నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ప్రవీణ్ సత్తార్ ఎంతో నమ్మకంగా ఉన్నాడట.

తాజాగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన లెవెన్త్ అవర్ వెబ్ సిరీస్ ప్రమోషన్ సందర్భంగా నాగార్జునతో చేయబోతున్న సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు. నాగార్జున ఈ సినిమాలో ఒక రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో పాత్ర కు నాగార్జున చాలా ఇంప్రెస్ అయ్యారని… పాత్ర తీరు చాలా బాగుందని అభినందించారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ తో పాటు పలు రకాల యాక్షన్ సీన్స్ ని కూడా నాగార్జున చేయబోతున్నారట. అందుకోసం బ్యాంకాక్ నుండి ప్రత్యేకంగా ట్రైనింగ్ కోసం మాస్టర్ లను కూడా తీసుకు వచ్చినట్లు ప్రవీణ్ సత్తార్ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement