Thursday, May 2, 2024

నా చావు మాములుగా ఉండకూడదు…ఆర్జీవి

రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. వర్మ పేరు వినిపించగానే అక్కడ ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుందని ఇట్టే చెప్పేయొచ్చు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు వర్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆర్జివి. తనకు భయం అంటే తెలియదని… భయం అంతకన్నా లేదని చెప్పుకొచ్చారు.

ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో చనిపోతారని దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పుకొచ్చాడు. పుట్టుక అనేది ఎంత సహజంగా జరుగుతుందో అనేది చావు కూడా అంతే సహజంగా ఉంటుందని కానీ నేను చనిపోతున్న సమయంలో ప్రశాంతంగా ఉండకూడదని… అను బాంబు పేలుడు చూడాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక వర్మ మాటలు విన్న నెటిజెన్స్ అయితే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement