Saturday, May 11, 2024

800 | ఓటీటీలోకి ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. రిలీజ్ డేట్ ఫిక్స్

లెజెండరీ క్రికెటర్, టెస్టు క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

కాగా, అక్టోబర్ 6న ‘800’ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది. ‘800’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ‘జియో సినిమా’ సొంతం చేసుకుంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ మొదలు కానుందని ఈ రోజు ట్వీట్ చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ సింహళ భాషల్లో ‘800’ డిజిటల్ రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement