Wednesday, May 1, 2024

శాకుంతలం లో మోహన్ బాబు…కారణం కూడా ఉంది !!

గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత శకుంతల గా మలయాళ హీరో దేవ్ కమల్ దుష్యంతుడు గా నటించబోతున్నారు. సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ సినిమాలో లో దూర్వాస మహాముని పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నారట. నిజానికి దూర్వాస మహాముని పాత్ర ఆ కథనే మలుపు తిప్పుతుంది. దూర్వాస మునికి ముక్కు మీద కోపం వుంటుంది. కోపం వస్తే వెంటనే సెపిస్తాడు. అందుకే ఆ పాత్రకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత వరకు ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement