Friday, April 19, 2024

ఫీల్ ల‌వ్ గుడ్ మూవీలు చేయాల‌ని ఉంది – అతుల్య ర‌వి…

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మీటర్‌’. రమేష్‌ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్‌ ఎంటర్‌ -టైన్‌ మెంట్‌ నిర్మిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పిస్తోంది. ఏప్రిల్‌ 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర హీరోయిన్‌గా అతుల్య రవి మీడియా సమావేశంలో మీటర్‌ చిత్ర విశేషాలు పంచుకున్నారు.

ఈ సినిమా కథలో మీకు నచ్చిన అంశాలు ఏమిటి ?
మీటర్‌ పక్కా కమర్షియల్‌ సినిమా. ఇందులో ఎమోషన్స్‌ కూడా వున్నాయి. పాటలు కూడా చాలా బావుంటాయి. భారీ సెట్స్‌లో ఒక పాట చేశాం. మాస్‌ ఫైట్స్‌ రోమాన్స్‌ లవ్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ తో పాటు- ఫాదర్‌ సెంటిమెంట్‌ కీలకంగా వుంటు-ంది.
తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు నేర్చుకున్నారు ?
ఈ సినిమా చేస్తున్నప్పుడే….టీమ్‌తో మాట్లాడుతున్నపుడు అలా వచ్చేసింది.
మీటర్‌ లో మీ పాత్రలో ఎలా వుంటు-ంది ?
నా పాత్ర చాలా డిఫరెంట్‌ గా వుంటు-ంది. అబ్బాయిలు అంటే ఇష్టపడని అమ్మాయి పాత్రలో కనిపిస్తాయి. నా పాత్ర సీరియస్‌ గా వుంటు-ంది. కానీ అందులో నుంచే కామెడీ జనరేట్‌ అవుతుంది.
చమ్మక్‌ చమ్మక్‌ పోరి పాటలో డ్యాన్స్‌ చాలా బాగా చేశారు కదా ?
నాకు చిన్నతనం నుంచి డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. కానీ నేర్చుకోలేదు. అయితే డ్యాన్స్‌ అంటే చాలా ఆసక్తి. ఎవరైన నేర్పితే మాత్రం ఎలాంటి మూమెంట్స్‌ అయిన చాలా త్వరగా నేర్చుకుంటాను.
ఇది మీకు కొత్త పరిశ్రమ కదా.. అలవాటు- పడటానికి ఎంత సమయం పట్టింది ?
నాకు అలాంటి ఫీలే లేదండీ. కథ విన్నప్పుడే చాలా కంఫర్ట్‌బుల్‌ అనిపించింది. లుక్‌ -టె-స్ట్‌ అయిన తర్వాత నేరుగా షూటింగ్‌ కి వెళ్ళాం. కిరణ్‌ గారు కూడా చాలా ఫ్రండ్లీ. తనలాగే నేను కూడా షార్ట్‌ ఫిలిమ్స్‌, ఇండిపెండెంట్‌ మూవీ చేసే వచ్చాను. ఆ కామన్‌ కనెక్షన్‌ మొదటి నుంచి వుంది.
ఇందులో కిరణ్‌ – మీ పాత్ర కెమిస్ట్రీ ఎలా వుంటు-ంది?
మా కాంబినేషన్‌ సీన్స్‌ చాలా సరదాగా వుంటాయి. హీరోయిన్‌ ఫాలో చేసి టీ-జ్‌ చేయడం, ప్రేమించడం.. ఇలా హిలేరియస్‌ గా ఉంటు-ంది. మరో కోణంలో ఎమోషన్స్‌ ఫైట్స్‌ మాస్‌ వుంటు-ంది.
ఎలాంటి జోనర్స్‌ సినిమాలు చేయాలని వుంది ?
ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీస్‌ చేయాలని వుంది. అలాగే రస్టిక్‌ సినిమాలు కూడా చేయాలని వుంది. ప్రయోగాత్మక పాత్రలు కూడా చేయాలనే ఆసక్తివుంది.
తెలుగులో ఏ హీరోలతో కలిసిపని చేయాలని వుంది ?
పవన్‌ కళ్యాణ్‌ గారు, బాలయ్య గారు, చిరంజీవి గారు,, మహేష్‌ బాబు గారు, అల్లు అర్జున్‌ గారు, జా.ఎన్టీఆర్‌ గారు, రామ్‌ చరణ్‌ గారు , రామ్‌ గారు, నితిన్‌ గారు.. ఇలా చాలా పెద్ద లిస్టే వుంది(నవ్వుతూ).
కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
తమిళ్‌ లో హరీష్‌ కళ్యాణ్‌ తో సినిమా చేస్తున్నా. ఇంకొన్ని చర్చల దశలో వున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement