Thursday, May 2, 2024

కిర‌ణ్ అబ్బ‌వ‌రం మీట‌ర్.. సాంగ్ ప్రోమో రిలీజ్

మీట‌ర్ చిత్రం నుండి సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ నెల 15వ తేదీన పూర్తి పాటను రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రంలో హీరోగా కిరణ్ అబ్బవరం న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో కిరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. రమేశ్ దర్శకత్వంలో మైత్రీ – క్లాప్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. జోరుగా .. హుషారుగా మాస్ బీట్ తో సాయికార్తీక్ స్వరపరిచిన ఈ పాట ఆకట్టుకునేదిలా ఉంది. ఈ సినిమాతో కథానాయికగా ‘అతుల్య రవి’ పరిచయం కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement