Friday, April 26, 2024

మెగాస్టార్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ సినిమా చేయబోతున్నాడు. దీంతోపాటు వేదాళం రీమేక్ లో కూడా నటించబోతున్నాడు. అయితే ఒరిజినల్ కథలోని కొన్ని మార్పులను చేసి లూసిఫర్ కథని సిద్ధం చేశాడు దర్శకుడు మోహన్ రాజా. ఇక ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ ఆగస్ట్ 12 నుంచి మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. కింగ్ మేకర్, గాడ్ ఫాదర్ ఇలా ఒక్కోటి తెరపైకి రాగా… ఆఖరికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను చిత్రయూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రనుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement