Saturday, October 5, 2024

మెగా ఫ్యాన్స్ కి మెగా సర్ప్రైజ్.. చరణ్ బర్త్ డేకి రెండు సినిమాలు రీ-రిలీజ్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మగధీర సినిమాను ఈ నెల (మార్చి) 27న రీ-రిలీజ్ చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ఈ వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, ఇప్పుడు చరణ్ అభిమానులందరికీ మరో సర్ప్రైజ్ ఉంది.. మగధీర సినిమాతో పాటు కల్ట్ ఫాలోయింగ్ పోందిన ఆరెంజ్‌ మూవీని చరణ్ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ స్పెషల్ రీ-రిలీజ్ ల ద్వారా వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీ ఫండ్ డ్రైవ్‌కు విరాళంగా ఇవ్వనున్నారు.

- Advertisement -

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఆరెంజ్ మూవీ రిలీజ్ అయిన సమయంలో తెలుగు ఇండస్ట్రీలో అతిపెద్ద ఫ్లాప్‌లలో ఒకటి. కానీ రిలీజ్ అయిన తర్వాత రొమాంటిక్ డ్రామా కాన్సెప్ట్‌కు కల్ట్ ఫాలోయింగ్‌ను పొందింది. మరి ఇప్పుడు ఈ సినిమా రీ-రిలీజ్ ఎలా ఉంటుందో చూడాలి. జెనీలియా హీరోయిన్ గా నటించిన ఆరెంజ్ మూవీకి నాగబాబు నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement