Sunday, May 5, 2024

EAGLE | రవితేజ ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్.. ‘ఆడు మచ్చ’ ఫుల్ సాంగ్ రిలీజ్

రవితేజ ప్ర‌ధాన పాత్ర‌లో కార్తీక్‌ ఘట్టమనేని తెర‌కెక్క‌స్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ ఎంటర్‌‌టైనర్ ‘‘ఈగల్‌’’. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. మేకర్స్ ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు, స్టైలిష్ లుక్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక, ఈగల్ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్‌ AaduMacha సాంగ్ ప్రోమోను లాంఛ్ చేశారని తెలిసిందే. రాహుల్ సిప్లిగంజ్‌ పాడిన ఈ పాటలో రవితేజ నయా మాస్‌ అవతార్‌లో కనిపిస్తున్నాడు. తాజాగా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు.

YouTube video

ఈగల్‌ను 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇక ఈగల్‌ టీజర్‌ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈగల్‌లో కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి Davzand మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు. ఇక మరోవైపు RT4GM (వర్కింగ్‌ టైటిల్‌)తో రవితేజ– గోపీచంద్‌ మలినేని మరో సినిమా చేస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ తెరకెక్కించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement