Thursday, May 2, 2024

Superstar : మ‌హేష్‌… స్టైలిష్ లుక్‌…

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటించే కొత్త చిత్రం అప్‌డేట్స్‌ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్‌ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ తొలిసారి నటిస్తున్న విషయం తెలిసిందే. వరుస విజయాల దర్శకుడితో సూపర్‌స్టార్‌ నటించే సినిమా ఎలా ఉంటుందనే విషయంపై ప్రేక్షకులే కాదు సినీ వర్గాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి.

- Advertisement -

గుంటూరుకారం తర్వాత మహేష్‌ కమిటైన ఏకైక చిత్రం రాజమౌళిదే. సహజంగా రాజమౌళి సినిమాలు మొదలై పూర్తికావడానికి సంవత్సరాలు పడుతుంటుంది. ఇకపోతే వయసుకు సంబంధం లేకుండా లుక్స్‌ పరంగా మహేష్‌ ఎప్పుడూ కొత్తగా కనిపిస్తుంటారు. వివిధ ప్రకటనల్లో నటిస్తూ, విదేశీ పర్యటనలు చేస్తూ మహేష్‌ బిజీగానే ఉంటారు. అయితే ఇంటికే ఎక్కువగా పరిమితమయ్యే ఆయన వర్కవుట్స్‌ మాత్రం మరవరు. తాజాగా కొత్తలుక్స్‌తో కనిపించారు మహేష్‌. లాంగ్‌ హెయిర్‌తో కనిపిస్తున్న మహేష్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్నాయి. అడవులు నేపథ్యంలో మహేష్‌ కొత్త సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement