Monday, May 6, 2024

మహేష్ బర్త్ డేకి…అది పక్కా !!

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా సినిమా టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం టీజర్ ఫైనల్ కట్ ముగిసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా దీనిని రిలీజ్ చేయబోతున్నారట. మైత్రి మూవీ మేకర్స్ జి.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్, 14 ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement