Sunday, April 28, 2024

ఒలింపిక్స్ అథ్లెట్లకి మహేష్ బాబు బూస్టింగ్..

టోక్యో ఒలింపిక్స్ కి వెళ్లే ఇండియన్ అథ్లెట్లకి ప్రోత్సహించేలా ఉంది మహేష్ బాబు కొత్త యాడ్..మహేశ్ బాబు వాయిస్ ఓవర్ తో థమ్సప్ ఓ వీడియో రూపొందిచింది. భజరంగ్ పునియా, మను బాకర్, వికాస్ వంటి అథ్లెట్లను ప్రోత్సహిస్తూ మహేశ్ బాబు పలికిన సంభాషణలు ప్రేరణ కలిగించేలా ఉన్నాయి. మీరేం సాధిస్తారని నిరాశకు గురిచేసే విమర్శకుల అభిప్రాయాలను తల్లకిందులు చేయండి అంటూ మహేశ్ బాబు పేరుపేరునా పిలుపునివ్వడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత అథ్లెట్ల గర్జన వారి సామర్థ్యంపై వచ్చిన ప్రతి ప్రశ్నను నోరు మూయిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈసారి దేశాన్ని గర్వించేలా చేస్తారని పేర్కొన్నారు. కాగా, టోక్యో ఒలింపిక్స్ జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి.

YouTube video

ఇది కూడా చదవండి: అల్లుడు దర్శకత్వంలో సూపర్ స్టార్ సినిమా ?

Advertisement

తాజా వార్తలు

Advertisement