Wednesday, May 1, 2024

ధనుష్ నెంబర్ వన్… సెకండ్ ప్లేస్ లో మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారిపాట సినిమా నుంచి బర్త్ డే బ్లాస్టర్ పేరుతో టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం దుమ్ము దులుపుతోంది. అయితే మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు కు సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు అభిమానులు. కాగా నిన్న సాయంత్రం ఏడు గంటలకు ట్విట్టర్ పేజీలో లైవ్ సెక్షన్ నడిచింది. మహేష్ టీం నిర్వహించిన ఈ లైవ్ సెషన్ లో మహేష్ తో పనిచేసిన దర్శకులు నిర్మాతలు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా వ్యవహరించిన ట్విట్టర్ స్పేస్ లైవ్ ను మహేష్ టీం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాగా దాదాపు 14 వేల మంది ఈ లైవ్ లో పార్టిసిపేట్ అయ్యారు. అయితే గతంలో ట్విట్టర్ స్పేస్ లైవ్ లో ధనుష్ నయా రికార్డ్ క్రియేట్ చేశారు. దక్షిణాదిన 28,000 మంది లైవ్ లోకి రావటంతో తొలి స్థానంలో నిలిచాడు. ఇక మహేష్ మాత్రం సెకండ్ ప్లేస్ లో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement