Tuesday, April 30, 2024

శివరాత్రి స్పెషల్….నారప్ప యంగ్ లుక్

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమా కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక వెంకటేశ్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. సమ్మర్ కానుకగా ఈ చిత్రం మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ చిత్రం జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్ మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇందులో వెంకటేష్ యంగ్ లుక్ లో కనిపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే వెంకీ ప్లాష్ బాక్ లో ఒక లుక్ ఆ తరువాత మరో లుక్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement