Saturday, May 4, 2024

మహానటి లుక్ టెస్ట్…కీర్తి ఫోటో వైరల్

మహానటి సినిమా తో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్ ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా పెద్ద హిట్ అయింది. ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత ఈ అమ్మడికి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. అలాగే రజనీకాంత్ సినిమాలో కూడా నటిస్తోంది.

ఇదిలా ఉండగా ఈ అమ్మడి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో పాతకాలం రవికె, కాటన్ చీర, ఎర్ర లంగా , చేతికి పచ్చ గాజులు ధరించి కనిపించింది కీర్తి. ఈ ఫోటోని షేర్ చేసిన నాగ్ అశ్విన్ .. లుక్ టెస్ట్ కి మొదటి రోజు .. ఈ ఫోటో వెనక జ్ఞాపకాలున్నాయి..అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement