Monday, May 6, 2024

మామా మ‌శ్చీంద్రా టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌నున్న.. మ‌హేశ్ బాబు

హ‌ర్ష‌వ‌ర్థ‌న్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం మామా మ‌శ్చీంద్రా. ఈ చిత్రంలో హీరోగా సుధీర్ బాబు న‌టిస్తున్నాడు. కాగా ఈ సినిమా టీజ‌ర్ ని సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు రిలీజ్ చేయ‌నున్నాడ‌ట‌. ఇక ఈ సినిమా టీజర్‌ను శనివారం రిలీజ్‌ చేస్తున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది. కాగా తాజాగా మేకర్స్‌ మరో క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా టీజర్‌ను సూప‌ర్ స్టార్ మహేష్‌బాబు రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ఇప్పటివరకు సినిమాకున్న క్రేజ్ డబుల్‌ అయ్యే అవకాశం ఉంది. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా ఈషా రెబ్బా, మృనాళిని రవి నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్‌ నారంగ్‌, పుస్కుర్ రామ్‌ మోహన్‌ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement