Wednesday, May 15, 2024

Leo Update | ‘హెరాల్డ్ దాస్‌’గా యాక్షన్ కింగ్ అర్జున్ బీభ‌త్సం

యంగ్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ లియో. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులన్నీ తిరిగరాయడానికి రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ యాక్షన్ డ్రామా నుండి ఇవ్వాల ఒక అప్డేట్ ఇచ్చారు మేక‌ర్స్. యాక్షన్ కింగ్ అర్జున్ పుట్టినరోజు సందర్భంగా.. మూవీలో అత‌ని రోల్ గురించి స్సెష‌ల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో అర్జున్ ‘హెరాల్డ్ దాస్‌’గా క‌నిపించ‌నున్నాడు. 41 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో అతను పవర్ ఫుల్ గా, భయంకరంగా కనిపించాడు. అనిరుధ్ రవిచందర్ తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మళ్లీ తనదైన ముద్ర వేశారు. లోకేష్ కనగరాజ్ ఈ తరహా చిన్న టీజర్లతో సినిమాపై మ‌రింత‌ హైప్ పెంచేస్తున్నాడు. ఇక‌ ఈ మూవీలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఈ పాన్ ఇండియన్ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement