Thursday, April 25, 2024

చెన్నైలో.. లియో కొత్త షెడ్యూల్

లోకేశ్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం లియో.. ఈ చిత్రంలో త‌మిళ‌స్టార్ హీరో విజ‌య్..హీరోయిన్ త్రిష జంట‌గా న‌టిస్తున్నారు.
ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్‌, యాక్షన్‌ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్‌, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి లోకేశ్‌ కనగరాజ్‌, రత్నకుమార్‌, ధీరజ్‌ వైడీ సంభాషణలు రాస్తున్నారు. మాస్టర్ సినిమా తర్వాత విజయ్‌, లోకేశ్ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన లియో టైటిల్‌ గ్లింప్స్ వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తూ.. నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సారి విజయ్‌ ను పక్కా మాస్‌ అవతార్‌లో చూపించబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో చెప్పేశాడు లోకేశ్‌ కగనరాజ్‌.ఏప్రిల్ మొదటి వారంలో లియో కొత్త షెడ్యూల్‌ చెన్నైలో ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement