Saturday, April 27, 2024

‘రుద్రుడు’గా లారెన్స్ .. ఫస్టులుక్!..యాక్షన్ నేపథ్యంలో సాగే కథ

త‌మిళంతో పాటు తెలుగు ఇండ‌స్ట్రీలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రాఘవ లారెన్స్ కు.. కాంచ‌నా సిరీస్ లో వ‌చ్చిన చిత్రాల‌న్నీ సూప‌ర్ హిట్ సినిమాలే.. హారర్ థ్రిల్లర్ సినిమాలు చేయడంలో లారెన్స్ సిద్ధహస్తుడు. యాక్షన్ సినిమాలు కూడా అద‌ర‌కొడతాడు.. ఆయన సినిమాల కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తుంటారు ఆయ‌న అభిమానులు. కాగా.. కథిరేసన్ దర్శకత్వంలో ఆయన తాజా సినిమా ‘రుద్రుడు’, కాగా.. ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

ఇప్పటికే ఈ సినిమా 90 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. శరత్ కుమార్ ఓ కీలక రోల్ లో క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో క్రిస్మస్ వేడుక‌గా విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement