Saturday, October 12, 2024

శంకర్ రామ్ చరణ్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ !!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. అంతేకాకుండా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా లో శంకర్ మార్క్ కనిపిస్తుందట.ఇక మరోవైపు హీరోయిన్స్ రేస్ లో కొత్తగా కియారా అద్వానీ పేరు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు రష్మిక మందన్న పేరు వినిపించింది. కాగా ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం కీయరా అద్వానీని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement