Friday, May 3, 2024

శంకర్ ఇండియన్ 2 సినిమా వివాదంపై లేటెస్ట్ అప్డేట్

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో గతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భారతీయుడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు-2 ప్రస్తుతం తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అలాగే శంకర్ మధ్య వివాదం కారణంగా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది..

. తమిళనాడు కోర్టులో ఇదే విషయమై కేసు నడుస్తోంది. అయితే కోలీవుడ్ వర్గాలు మంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. తమిళనాడు హైకోర్టు భారతీయుడు-2 ఇష్యూపై మాజీ సుప్రీం జడ్జి ఆర్ పనుమతిని మధ్యవర్తిగా నియమించారట. వారి స్టేట్ మెంట్ అనంతరమే ఈచిత్రం సమస్యపై క్లారిటీగా తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే శంకర్ రామ్ చరణ్ తో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement