Saturday, May 18, 2024

Guntur Kaaram | ప్రీరిలీజ్ ఈవెంట్ పై లేటెస్ట్ అప్‌డేట్.. అక్కడ లైవ్ స్ట్రీమింగ్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమా మరో పది రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో త్వరలోనే ట్రైలర్‌ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై సూపర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న హైదరాబాద్ లో జరగనుండగా.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అమెరికా థియేటర్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇలా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో లైవ్ స్ట్రీమింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఆ రోజే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement