Sunday, April 28, 2024

Latest | డిమోన్ వార్ బిగిన్స్.. ప‌వ‌ర్ ఫుల్ గా K46 టీజ‌ర్

దర్శకుడు విజయ్ కార్తికేయ ద‌ర్శ‌క‌త్వంలో కన్నడ స్టార్ హీరో సుదీప్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కిచ్చా46. ఈ మూవీ టైటిల్ ఇంకా అఫీషియ‌ల్ క‌న్ఫామ్ అవ్వలేదు. అయితే ఈ మూవీ నుండి మేకర్స్ ఓ పవర్ ఫుల్ అప్డేట్ ని అందించారు. ఈ సినిమా నుంచి ఓ టీజర్ ని రిలీజ్ చేశారు.. ఈ టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి.

ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ లో ఓ బస్ లో సుదీప్ గాయాలతో తనకి తానే ఒంట్లో నుంచి బుల్లెట్స్ తీసుకుంటూ చూపించిన విజువల్స్ స్టన్నింగ్ గా ఉండగా అదే బస్సు లో అప్పటికే చాలా మందిని చంపేసిన సుదీప్ కనిపిస్తున్నాడు.

ఈ టీజ‌ర్ లో బాద్ షా లుక్ ఆకట్టుకునేలా ఉంది, కిచ్చా సుదీప్ నుండి ఈసారి క‌చ్చితంగా యాక్షన్ ప్యాక్డ్ మూవీని ఆశించవచ్చు. బ్యాక్ గ్రౌంగ్ స్కోరు టీజ‌ర్ కి మ‌రింత హైప్ క్రియేట్ చేసింద‌నే చెప్ప‌వ‌చ్చు.
కిచ్చా క్రియేషన్స్‌తో కలిసి వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైప్పులి ఎస్ థాను ఈ మూవీని నిర్మిస్తుండ‌గా.. కాంతారా ఫేమ్ అజనీష్ లోకాంత్ సంగీత అందిస్తున్నాడు.

- Advertisement -

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement