Friday, March 29, 2024

కేటీఆర్ సోనూసూద్ చాట్ వైరల్!!

బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటుడిగానే కాకుండా కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి ఆదరాభిమానాలు పొందాడు. వలస కూలీల కు స్వగ్రామాలకు తరలించి దేవుడయ్యాడు. అయితే సోనూసూద్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. మరోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా యాక్టివ్ గా ఉంటారు.

తాజాగా ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు సోను. కేటీఆర్ నిజమైన హీరో అని కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని సోనూసూద్ చెప్పుకొచ్చారు. అయితే ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. తాను ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడిని అని తనకు చేతనైనంత సహాయం చేస్తున్నానని సూపర్ హీరో తాను కాదు సూపర్ హీరో మీరు సోనుసూద్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఇద్దరి చాట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement