Tuesday, March 26, 2024

రష్యా నుంచి హైదరాబాద్ కు 27.9 లక్షల స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ డోసుల దిగుమతి..

ర‌ష్యా నుంచి భార‌త్ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ల‌ను దిగుమ‌తి చేసుకుంటోన్న విష‌యం తెలిసిందే. మూడో విడతలో ఏకంగా 27.9 లక్షల డోసులు దిగుమతి అయ్యాయి. రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్  ఆర్యూ-9450  విమానంలో ఈ వ్యాక్సిన్ల‌ను తీసుకొచ్చారు. 90 నిమిషాల్లో దిగుమతి ప్రక్రియ పూర్తి చేసి, రెడ్డీస్‌ ల్యాబ్స్‌కు తరలించారు. దీంతో దేశంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్‌ దిగుమతులకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో వేదికైంది. కాగా, తొలి విడ‌త‌లో భార‌త్‌కు 1.5 లక్షలు, రెండో విడతలో 60 వేల డోసులను దిగుమతి చేసుకున్న విషయం విదిత‌మే. ఇప్పటివరకు మొత్తం 30 లక్షల డోసులు భారత్‌కు చేరుకున్నాయి. ఈ నెల మ‌రో 50 లక్షల డోసులు దిగుమ‌తి కానున్నాయి. కొన్ని రోజుల్లో భార‌త్‌లో స్పుత్నిక్-వీ డోసుల‌ పంపిణీని ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement