Tuesday, October 8, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని అనాల్సిన అవ‌స‌రం కోటకి లేదు.. న‌ట్టి కుమార్

వ‌య‌సు అయిపోయిన న‌టుడు కోట శ్రీనివాస‌రావుకు వివాదాలు ఎందుకు..ఏం అవ‌స‌రం అని ఫైర్ అయ్యారు నిర్మాత న‌ట్టి కుమార్..ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజాయితీగా ,నీతిగా నేను టాక్స్ కడుతున్నాను..నేను టాక్స్ పేయర్ ని, నేను ఇంత తీసుకుంటున్నా ..నేను ఇంత తీసుకుంటున్నా కూడా ప్రజల కోసం అవన్నీ వదులుకుని వస్తున్నాను..బ్రతుకుతున్నాను…నాకు ఓటేయండి..నేను మీ కోసం కష్టపడతా..మీ కోసం శ్రమిస్తా అంటున్నారు..అందులో తప్పేముంది..ఆయన టాక్స్ కడుతున్నాడు కాబట్టి చెప్పారు..కోట టాక్స్ ఎగ్గొడుతున్నాడు కాబట్టి చెప్తున్నారా..కోట మూడు షిప్ట్ లు, నాలుగు షిప్ట్ లు కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఒకరి మీద ఆయన పడకూడదు…కోటకు మైక్ ఇచ్చారు..వాగేయటం మొదలెట్టేసారు..ముసలాయన, ఏజ్ అయ్యిపోయింది…కాబట్టి ఆయన హద్దులో ఆయన ఉంటే బెటర్. కోట …నిర్మాతకు టైట్ ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు… పవన్ కళ్యాణ్ రూపాయి ఇచ్చేవాడే కానీ ,ఎవరినీ ఇబ్బంది పెట్టలేద‌న్నారు నట్టికుమార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement