Sunday, April 28, 2024

కంటెంట్ కు కనెక్ట్ అయిన కొరటాల శివ!

హీరో సత్యదేవ్ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నారు. డిఫ్రెంట్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సత్యదేవ్. అయితే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో కూడా సత్యదేవ్ ఓ సినిమా చేయబోతున్నాడు. నూతన దర్శకుడు వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ ఓ సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాను సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పక్క ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అంతేకాకుండా కంటెంట్ నచ్చడం వల్లే కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారట. కృష్ణ కొమ్మలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement