Thursday, April 25, 2024

కొమరం భీం వచ్చేశాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ కు విషెస్ తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ ఆర్ సినిమా చూస్తున్నాడు. ఈ సినిమాలో కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.

అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొమరం భీమ్ కు సంబంధించి ఓ అప్డేట్ ను ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. చెప్పినట్టుగానే ఆ అప్డేట్ ఇచ్చేసింది… చెప్పినట్టుగానే కొమరం భీం పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో బల్లెం పట్టుకుని ఎన్టీఆర్ రౌద్రంగా కనిపించాడు.

నా భీంకు బంగారం వంటి మ‌న‌సున్నోడు… కానీ ఒక్క‌సారి తిర‌గ‌బడితే మొండిగే నిల‌బ‌డి, క‌ల‌బ‌డే ధైర్యం ఉన్నోడు అంటూ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement