Sunday, April 28, 2024

తెలుగు అమ్మాయిని కావటం కలిసొచ్చింది – హీరోయిన్‌ కావ్యా కళ్యాణ్‌ రామ్‌

 శ్రీ సింహ కోడూరి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్‌’. కావ్యా కళ్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌. ఫణిదీప్‌ దర్శకుడు. ఈ సినిమా ఇదేవారంలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ కావ్యా కళ్యాణ్‌రామ్‌ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ…

– మా సినిమా కం-టె-ంట్‌పై చాలా నమ్మకంగా ఉన్నాం. చాలా ఇష్టపడి చేసిన సినిమా. – సూర్య అనే పాత్రలో శ్రీసింహ కనపించబోతున్నారు. హీరో తన బైక్‌ను ఉస్తాద్‌ అని పిలుచుకుంటు-ంటాడు. తను టీ-నేజర్‌ నుంచి యువకుడిగా ఎదగటం, ఫైలట్‌గా జాబ్‌ సంపాదించటం అనేది సినిమాలో ప్రధానాంశం. ఇందులో సూర్య ప్రేయసి మేఘన పాత్రలో నేను నటించాను.

– మేఘన పాత్ర విషయానికి వస్తే ఆమె గవర్నమెంట్‌ జాబ్‌ చేయాలని తండ్రి కోరుకుంటాడు. మానసికంగా తను చాలా బలవంతురాలు. తన క్యారెక్టర్‌ చాలా మంది అమ్మాయిలకు కనెక్ట్‌ అవుతుంది.- గౌతమ్‌ మీనన్‌గారు ఇందులో చాలా కీలక పాత్ర పోషించారు. హీరోకి మెంటర్‌ పాత్ర. మా డైరెక్టర్‌ ఫణిదీప్‌గారు గౌతమ్‌ మీనన్‌కి పెద్ద ఫ్యాన్‌.

– తెలుగు హీరోయిన్స్‌కి అవకాశాలు రావటం లేదని ఎందుకు అంటు-న్నారో అర్థం కావటం లేదు. నా విషయానికి వస్తే నేను తెలుగు అమ్మాయిని కావటం నాకు కలిసివచ్చింది. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాను. భాష వస్తే చాలు అవకాశం వస్తుందనుకోకూడదు. ఎందుకంటే నటీ-నటు-లు ఒక భాషకే పరిమితం కాకూడదు. అంటూ ముగించింది కావ్యా

Advertisement

తాజా వార్తలు

Advertisement