Thursday, October 3, 2024

క్రోమాలో ఇండిపెండెన్స్‌ డే సేల్‌

టాటా గ్రూప్‌కు చెందిన క్రోమా ఇండిపెండెన్స్‌ డే సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు వంటివాటిపై డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది. ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు, ఈఎంఐ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆగస్టు 16 వరకు ఈ ప్రత్యేక సేల్‌ ఉంటుందని క్రోమా తెలిపింది.

ప్రత్యేక ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ స్టోర్లు, ఆన్‌లైనలోనూ అందుబాటులో ఉంటాయని తెలిపింది. స్మార్ట్‌ ఫోన్లు 12,499 రూపాయలతో ప్రారంభం అవుతాయని, మొబైల్‌ కొనుగోలుపై 49 రూపాయలకే స్మార్ట్‌ వాచ్‌ పొందవచ్చని తెలిపింది. ఇక స్మార్ట్‌ వాచ్‌లు 2,999 రూపాయల నుంచి లభిస్తాయని తెలిపింది. గాడ్జెట్‌లు 20వేల నుంచి అందుబాటులో ఉన్నాయని, వీటిపై 15 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ఇస్తున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement