Monday, May 20, 2024

కత్తి మహేష్ కు తప్పిన ప్రమాదం

సినీనటుడు కత్తి మహేష్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని కత్తి మహేష్ కారు ఢీకొట్టింది.

కాగా ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇక నెల్లూరు మెడికేర్ హాస్పిటల్ లో కత్తి మహేష్ చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. కాగా అసలు ఆక్సిడెంట్ ఎలా జరిగింది అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement