Tuesday, October 8, 2024

Kantara 2 | కాంతార 2 పై లేటెస్ట్ అప్‌డేట్‌.. ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..

కన్నడ సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన కాంతార‌… నేష‌న్‌వేడ్‌గా భాక్సాఫీస్ వద్ద సెన్షేషన్ క్రియేట్ చేసింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కేవలం 25 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ… దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమా ఇంతటి బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ మూవీకి సెకండ్ పార్ట్‌గా ప్రీక్వెల్‌ని తీసుకురానున్నట్టు ప్రకటించాడు రిషబ్ శెట్టి.

కాగా, తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ గురించిన అప్డేట్ అందించారు మేకర్స్. ఈ నెల 27న మధ్యాహ్నం గం.12:25 నిమిషాలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక, హోంబేలె ఫిలిమ్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement