Sunday, April 28, 2024

సలార్ లో కాజల్ అగర్వాల్…ఐటమ్ సాంగ్ ?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సలార్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కూడా ఉండబోతోందని మొదటి నుంచి టాక్ నడిచింది. ఆ సాంగ్ లో డాన్స్ చేసేది ఈమెనే అంటూ కూడా రకరకాల వార్తలు వచ్చాయి.

కాగా తాజా సమాచారం ప్రకారం ఆ సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ ను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. ఈ సాంగ్ ను వచ్చే షెడ్యూల్ లో షూట్ చేయబోతున్నారట. ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ లో ఐటమ్ సాంగ్ లో తమన్నా నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement