Sunday, May 5, 2024

జస్ట్ ఆస్కింగ్… వ్యాక్సిన్ పై ప్రకాష్ రాజ్ ప్రశ్న

దేశంలో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతుంది. ప్రతిరోజు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అందరికీ వ్యాక్సిన్ ను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ ధరల విషయంలో అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రంపై ప్రతిపక్ష నేతలు మాత్రం మండిపడుతున్నారు.

తాజాగా కేంద్ర ప్రభుత్వం వైఖరిపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ వ్యాక్సిన్ పట్ల ప్రశ్నను లేవనెత్తారు ప్రకాష్ రాజ్. దీని పట్ల ఇప్పటికే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ట్విట్ వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement